CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
- ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ.. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు..
- టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు.. కానీ, వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
- గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోచంద్రబాబుతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు.. టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Trump-Modi: మోడీపై ట్రంప్ ప్రశంసలు.. తెలివైన వ్యక్తి అంటూ కితాబు
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు. టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు అంటూ సెటైర్లు వేశారు. నాకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావు.. క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక, 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం.. చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి.. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం.. ఎక్కడికక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!