Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
- రూపాయి బలహీనత
- ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి?
- గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
- పెట్టుబడిపై నిపుణుల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించడం కాదు.. సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయని వారు పేదవారంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు పలు రకాల మార్గాలు ఉన్నప్పటికీ భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న సమయంలో పెట్టుబడిదారుల్లో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలంటే బంగారంలోనా, ఫిక్స్డ్ డిపాజిట్లలోనా (FDs), లేక రియల్ ఎస్టేట్లోనా? అనే సందేహం చాలామందిలో ఉంది. మార్కెట్ నిపుణులు మాత్రం పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
బంగారం.. సురక్షిత పెట్టుబడిగా గుర్తింపు
రూపాయి బలహీనపడినప్పుడు సాధారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలో ట్రేడ్ కావడం వల్ల రూపాయి విలువ తగ్గితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం వరకు బంగారం ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
ఎఫ్ డీలు.. స్థిరమైన ఆదాయం కోరేవారికి
మార్కెట్ ఒడిదుడుకులు ఇష్టపడని వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఎంపికగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం పలు బ్యాంకులు 7% నుంచి 8.5% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఎఫ్ డీలలో పెట్టుబడి పెడితే మూలధన భద్రత ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు వాస్తవ లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎఫ్ డీలు అనుకూలంగా ఉంటాయి.
రియల్ ఎస్టేట్.. దీర్ఘకాల పెట్టుబడిదారులకు
రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించే అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా మెట్రో నగరాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి అధిక మూలధనం అవసరం. అలాగే లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం అంత సులభం కాదు.
నిపుణుల సూచన ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకే పెట్టుబడి సాధనంపై ఆధారపడకుండా డైవర్సిఫికేషన్ (వైవిధ్యీకరణ) వ్యూహాన్ని అనుసరించడం మంచిది. 10-15% బంగారం.. 20-30% FDలు లేదా డెట్ ఇన్స్ట్రుమెంట్లు, మిగిలిన భాగం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి సమతుల్య పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
రూపాయి బలహీనత సమయంలో బంగారం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, ప్రతి పెట్టుబడి సాధనానికి ప్రత్యేక ప్రయోజనాలు, రిస్క్‌లు ఉంటాయి. తక్షణ భద్రత కోసం FDలు, ద్రవ్యోల్బణ రక్షణ కోసం బంగారం, దీర్ఘకాల సంపద కోసం రియల్ ఎస్టేట్‌ను పరిగణించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని తప్పనిసరిగా అంచనా వేయడం అవసరం.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!