ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు.
కృష్ణా రాజకీయాలు ఎప్పుడూ ఎండాకాలం అంత హాట్ హాట్ గా వుంటాయి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వైసీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతిచ్చారు. వెన్నుపోటంటే జగన్ కే బాగా తెలుసు.తండ్రిని బెదిదిరించి…
తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు…
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5వరకు స్వామివారి దర్శనాలకు బ్రేక్. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులో సీనియర్ కార్యకర్తలకు సన్మానం విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. రైవాడ జలాశయం నీటికి రాయల్టీ చెల్లింపు…