Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుప్రీత్ (ఛత్రపతి ఫేమ్ కాట్రాజ్)కు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుప్రీత్ ఒక క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ వివాదాస్పద సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నటుడి ప్రవర్తనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సదరు క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ ముగించుకుని, నెక్ట్స్ మరేదైనా బుకింగ్ అవుతుందేమోనని ఎదురుచూస్తూ నాగారం చౌరస్తాలో తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచాడు. సరిగ్గా అదే సమయంలో నటుడు సుప్రీత్ తన కారులో అక్కడికి వచ్చాడు. రోడ్డు పక్కన ఆపి ఉన్న శ్రీహరి క్యాబ్ కారును చూసి, తనకు అడ్డంగా పెట్టావంటూ డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే నటుడు సుప్రీత్ కోపంతో ఊగిపోతూ క్యాబ్ డ్రైవర్ శ్రీహరిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై భౌతికంగా దాడి చేసి చితకబాదాడు. ఈ అకస్మాత్తు దాడితో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నటుడు సుప్రీత్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..