Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ సామాజిక, రాజకీయ అంశాలపై ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల పనితీరు, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఆయన వేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.
తన ట్వీట్లో రాహుల్ రామకృష్ణ పేర్కొంటూ.. “పవన్ కళ్యాణ్ గారు.. మీ గొప్పలు, ఆర్భాటాలు పక్కన పెడితే.. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ( సమాచార హక్కు చట్టం) కింద మీరు నిర్వహించే శాఖల్లోని ప్రతీ విభాగంలో సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని మీ శాఖల్లో అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. మీరు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అని రాసుకొచ్చారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అంతటితో ఆగకుండా గిరిజన ప్రాంతాల్లోని చట్టాల అమలుపై కూడా రాహుల్ ప్రశ్నలు గుప్పిస్తూ.. “PESA (పెసా) చట్టం, 1/70 చట్టం, గ్రామసభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి చూపించండి. అలాగే మీరు చేసినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలు కూడా చెప్పండి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల గురించే మిమ్మల్ని అడుగుతున్నాను” అని నిలదీస్తూ ట్వీట్ ముగింపులో ఆయన ‘జై తెలంగాణ’ అని నినదించడం విశేషం. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల నుంచి ఎదురయ్యే ట్రోలింగ్‌ను ముందుగానే ఊహించిన రాహుల్ రామకృష్ణ.. ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను’ అని ట్వీట్ చేయడం కొసమెరుపు.
@PawanKalyan please ask and show for results for the implementation of PESA, 1/70 Act, Grama Sabha Act. The afforestation programs, did you do them? numbers seem dubious as verified by an independent body
I’m asking for filed and marked resultsJai Telangana!
— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!