Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..

Minister Narayana

Minister Narayana

Amaravati Land Allocation: అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం అన్నారు మంత్రి నారాయణ..వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు.మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాలతో కేటాయింపులు రద్దు చేసుకున్నాయన్నారు నారాయణ.మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన దానికి బదులు వేరే చోట భూకేతయింపు చేశామని చెప్పారు..రాజధాని లో భూ కేటాయింపు లపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది.రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదన్నారు. నారాయణ.. అమరావతి లో భూముల కేటాయించమని తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు మంత్రి నారాయణ.. ముంబై నుంచి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వచ్చిన సంస్థల ఆర్ధిక పరిస్థితులు చూసి భూ కేటాయింపు జరుగుతుంది అన్నారు మంత్రి. నారాయణ.

ఇక, అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ నిర్మాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని సూచించినప్పటికీ, అమరావతి రాష్ట్ర రాజధాని కావడంతో నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను ఇచ్చారని, గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడూ రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు, తెలుగు సినీ పరిశ్రమ నుంచి అమరావతిలో భూముల కేటాయింపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే ముంబైకి చెందిన కొన్ని సినీ, వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భూముల కేటాయింపుకు ముందు ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాలని కోరుతున్నామని చెప్పారు.

×
×
Ad