AP Secretariat Security: రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత కచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీస్ విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు.. ముఖ్యంగా, మావోయిస్టులు విజయవాడ…
Amaravati Development: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే…
Jogi Ramesh : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నారా వారి సారా ఎపిసోడ్‌ను బయటపెట్టిన తర్వాతే తమపై కుట్రలు మొదలయ్యాయని ఆయన అన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా వారి సారా ఎపిసోడ్ గురించి అందరికీ వివరించా. ఇబ్రహీంపట్నం తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నిజాలు బయటపెట్టా. అక్కడ తయారైన సారా…
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు…