నేడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (సీఆర్‌డీఏ) కీలక సమావేశం జరగనుంది.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ 45వ సమావేశం జరగనుండగా.. రాజధాని పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా ఈ అథారిటీ.. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది సీఆర్డీఏ భేటీ..
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించామని చెప్పారు. మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.