Minister Nrayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. భూములు కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గైయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Ltd), అంబికా దర్బార్ బత్తి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి…