Home
Amaravati Infrastructure
Amaravati Infrastructure News
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
Amaravati: అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం ఓ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం వివిధ ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్… -
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. ఇక, రాజధాని పరిధిలోకి గ్రామాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మంజూరైన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లను కేటాయించడంతో మొత్తం నిధులు రూ.1,437 కోట్లకు చేరాయి. 29 గ్రామాల్లో మౌలిక వసతులకు భారీగా నిధులు… -
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో పాటు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాయపూడి నుంచి… -
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి, మావిగన్ ప్రతిపాదన, నిర్మాణాల పురోగతిపై స్పందించారు. అయితే, మావిగన్ అనే ప్రతిపాదనను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, దాన్ని వింటే అందరూ నవ్వుతున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు.… -
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
Minister Narayana: రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొండవీటి వాగు, పాలవాగు పనులను వేగవంతం చేశామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అమరావతిలో ప్రస్తుతం 69 వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.. గతంలో కొండవీటి వాగు వెడల్పు చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం దానిని… -
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
YS Jagan: రాజధాని ప్రాంత రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. రైతులను బలవంతపెట్టి నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని సంతోషపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని, ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక,… -
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
Amaravati Land Allocation: అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం అన్నారు మంత్రి నారాయణ..వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు.మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాలతో కేటాయింపులు రద్దు చేసుకున్నాయన్నారు నారాయణ.మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన దానికి బదులు వేరే చోట భూకేతయింపు చేశామని చెప్పారు..రాజధాని లో భూ కేటాయింపు లపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది.రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదన్నారు. నారాయణ..… -
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో హైదరాబాద్‌లో పెద్దగా ఆసుపత్రులు లేకపోయాయని గుర్తు చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ను గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడి హాస్పిటాలిటీ వ్యవస్థను… -
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Nandamuri Balakrishna: అమరావతి పరిధిలోని తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం, మరియు ఆస్పత్రి ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలకు బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం వల్లే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ… -
Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!
Amaravati Capital Development: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అయితే, అమరావతి.. చట్టబద్ధత బిల్లుకు ఆమోదం రావడంతో ప్రభుత్వం పై మరింత బాధ్యత పెరగనుంది. బాధ్యత పెరగడమే… కాదు. ఒత్తిడి కూడా పెరుగుతోంది.. కూటమి ప్రభుత్వం. అమరావతి.. నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఒక టైం లైన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి.. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు.. ట్రంక్ రోడ్లు..…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!