Investments in Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల జోరు మళ్లీ మొదలుకానుంది. రాబోయే సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒప్పందాలు (MOU)లు కుదిరినట్లు సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఈ సమ్మిట్ విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరగనుంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతులు వంటి విభాగాల్లో రానున్నాయి. అమరావతిని సుస్థిర నగర అభివృద్ధి కేంద్రంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాల హబ్‌గా…