Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు. Read…
Janasena: అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకుని వస్తే మోసం చేశారని వాపోయింది. అయితే, విచారించి కేసు నమోదు…
Minister Satya Kumar Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు రెండో రోజున మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంప్రదాయ వాతావరణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలోని పాటకు మంత్రి ఉత్సాహంగా అడుగులు…
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో…
Off The Record: ఆ నాయకుడు మళ్ళీ గుడ్ మార్నింగ్ అంటూ జనం మధ్యకు రాబోతున్నారా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్మేసిన వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా పోయిందా? ఇప్పుడు మళ్లీ ఎందుకు జనంలోకి రావాలనుకుంటున్నారాయన? జనం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా శుభోదయం కథకమామీషు? ఏపీ పాలిటిక్స్‌లో గుడ్ మార్నింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం…
Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గ రాజకీయం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. వేరే ఏ సెగ్మెంట్‌తో చూసుకున్నా… ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటుంది. కేవలం ఒకే మండలం, రెండు మున్సిపాలిటీలు ఉన్నందున పెద్దగా పొలిటికల్ హడావిడి ఉండదు. గతంలోని ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున జితేంద్ర గౌడ్, 2019లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచినా… ఇద్దరూ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. వాళ్ళ…
కొండ ప్రాంత రాజకీయాల్లో కీలక మలుపు. ఆధిపత్య పోరులో అసలైన కుదుపు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత పోరుకు ముగింపు పలుకాలన్న ఉద్దేశ్యంతో.. అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది అధిష్టానం.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ తర్వాత రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండొద్దు.. స్వచ్ఛంధ్రాలో అనకాపల్లి 13వ స్థానంలో ఉంది.. ర్యాంకింగ్ మెరుగుపడాలని సూచించారు. అలాగే, నాతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీల పని తనాన్ని పరిశీలిస్తున్నాను.. సమర్ధవంతంగా ఎలా పని చేయించాలో నాకు తెలుసు.. ఎవరినీ వదిలిపెట్టను అన్నారు.
Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో వన్ టూ వన్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న (ఆన్ గోయింగ్) ప్రాజెక్టుల వివరాలపై పవన్ కల్యాణ్…