Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Allocation: అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం అన్నారు మంత్రి నారాయణ..వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు.మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాలతో కేటాయింపులు రద్దు చేసుకున్నాయన్నారు నారాయణ.మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన దానికి బదులు వేరే చోట భూకేతయింపు చేశామని చెప్పారు..రాజధాని లో భూ కేటాయింపు లపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది.రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదన్నారు. నారాయణ.. అమరావతి లో భూముల కేటాయించమని తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు మంత్రి నారాయణ.. ముంబై నుంచి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వచ్చిన సంస్థల ఆర్ధిక పరిస్థితులు చూసి భూ కేటాయింపు జరుగుతుంది అన్నారు మంత్రి. నారాయణ.
ఇక, అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ నిర్మాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని సూచించినప్పటికీ, అమరావతి రాష్ట్ర రాజధాని కావడంతో నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను ఇచ్చారని, గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడూ రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు, తెలుగు సినీ పరిశ్రమ నుంచి అమరావతిలో భూముల కేటాయింపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే ముంబైకి చెందిన కొన్ని సినీ, వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భూముల కేటాయింపుకు ముందు ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాలని కోరుతున్నామని చెప్పారు.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?