Chairman's Desk: ఆంధ్రులకు రాజధాని శాపం ఉన్నట్టుగా ఉంది. పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా చెన్నయ్, కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడలేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా మూడేళ్లలో రాజధానిని ఏర్పాటు చేసుకోగలిగాయి. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇలా రకరకాల కారణాలతో ఏపీ రాజధాని అర్ధంకాని బ్రహ్మపదార్ధంగా మారిపోయింది.