బతికున్నప్పుడు వేధింపులు…మరణం తర్వాతా సాధింపులా? ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అసలు ఆయన మరణానికీ ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా….సయోధ్య కుదరలేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత ఆగ్రహం….అసహనం? నెల్లూరు రాజకీయాల కథే వేరు. చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉంటాయి. ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పైఎత్తులు వేస్తూ…
Nara Lokesh Kavali Visit: కావలి రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని దగదర్తికి పర్యటనకు రానున్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కావలి టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు లోకేష్ పుల్‌స్టాప్ పెట్టబోతున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌కు చెందిన మధుసూదన్ ఉద్యోగరీత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మధుసూదన్‌కు 42 బుల్లెట్లు తగిలినట్లు సమాచారం తెలుస్తోంది. Also Read: AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..…
నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివిధ వర్గాల ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా సంస్థ కార్యాలయానికి నిర్వాహకుడు రాకపోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు... దీంతో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూళ్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది.
డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై…
కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఐదేళ్లుగా అధికారులు చూట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్ 2007లో అప్పటి ప్రభుత్వం తనకు…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే పొత్తులు, ఎత్తులపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. అయితే, ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మహీధర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.