గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని పొలాల వద్ద పుట్టగొడుగుల కోసం వెళ్లిన నేపథ్యంలో పాము కరిచినట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ( ANU) దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు ( విశాఖ, కర్నూలు, అమరావతి ) రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి, ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు తొలిరోజు జాబ్ మేళా విజయవంతంగా ముగిసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొదటి రోజు 142 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్
నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ పై మరోసారి విచారణ కమిటీ నియామకం చేసారు. రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలపై విశ్రాంత ఐఏఎస్‌తో కమిటీ ఏర్పడింది. ఆరోపణలు వాస్తవమేనని గతంలో ప్రభుత్వానికి చక్రపాణి కమిటీ నివేదిక అందించ