నిత్యం మనం సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలానే చూస్తుంటాం. వారు దగ్గినా, తుమ్మినా కూడా మస్త్ అనిపిస్తుందంటూ చిన్న పిల్లల వీడియాలను నెటిజన్స్ తెగ వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఓ వీడియో కూడా నెట్టించ చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో ఓ చిన్నారితో తల్లి గొడవ పడుతుంది. అలా తనతో తల్లి గొడవ పడడంతో చూసినంత సేపు చూసిన ఆ బుడ్డది.. ఆ తర్వాత వాళ్ల అమ్మ ముక్కుపై ఒక్కటి గుద్ది బుగ్గలను గిచ్చేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Ice Cream: కాటేదాన్‌లో కల్తీ ఐస్ క్రీమ్.. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో నకిలీ ముఠా
అయితే.. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్న భర్తలు కూడా ఆడపిల్ల పుట్టగానే కూతురే తమ ప్రపంచం అన్నట్లుగా మారిపోతుంటారు. ఈ వీడియోలోని మహిళ పరిస్థితి కూడా అంతే.. తన కూతురు పుట్టగానే తనను తన భర్త పట్టించుకోవడం లేదని.. ఆ చిన్నారితో ఆమె గొడవకు దిగింది. నా భర్తను నాకు ఇచ్చేయ్.. అతని సమయాన్ని, డబ్బును నువ్వే తీసుకుంటున్నావు.. నీ కంటే ముందు అతను నన్ను ప్రేమించాడు.. అతను నావాడు అంటూ తన కూతురుని ఆ తల్లి డిమాండ్ చేస్తుంది.
Also Read: Weekly Gold Price: ఈ వారం తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసుకోండి?
అయితే తల్లి మాటలను సరదాగా తీసుకున్న ఆ బుడ్డది.. ఒక్కసారిగా వాళ్ల అమ్మ ముక్కుపై ఒక్కటి గుద్దింది. అంతే.. అనంతరం తల్లి బుగ్గలను పట్టి గట్టిగా లాగింది. అయితే ఈ వీడియో బాగా నెటిజన్స్ కు నచ్చడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సరదా సరదా కామెంట్లతో, ఎమోజీలతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 47 వేలకు పైగా లైకులు వచ్చాయి. కోట్లలో వ్యూస్ పెరిగాయి.