Spitting Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ సహబత్ ఆలమ్ అనే యువకుడు, ఓ విషసర్పం అయిన స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra) ను చేతిలో పట్టుకొని మజాక్ చేస్తున్నాడు. కానీ.. నిమిషం కూడా కాదు.. తర్వాత జరిగిన సీన్ చూసి నెటిజన్లు షాక్లో పడిపోతున్నారు.
వీడియోలో చూస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని ఆ యువకుడు కోబ్రాని తన చేతితో పట్టుకొని ఆడిస్తుంటాడు.. అయితే.. అప్పుడు ఒక్కసారిగా ఆ కోబ్రా అతడి ముఖంపై విషాన్ని చిమ్మింది. అదికూడా నేరుగా కళ్లలోకి!
విషం కంట్లో పడిన వెంటనే అతడి ముఖం కంగారుతో మారిపోయింది. నొప్పితో వెంటనే వెనక్కు వెళ్లాడు. వీడియో ఇక్కడితోనే ఆగిపోతుంది కానీ.. అప్పటికే ఆ సీన్ చూసిన వాళ్ల గుండెల్లో దడ మొదలైంది. ఎవరికైనా ఇది భయానకంగా ఉంటుంటి కదా..!
Sangeet Sobhan: నిహారిక నిర్మాతగా సినిమా మొదలెట్టిన సంగీత్ శోభన్
ఈ వీడియో @sahabatalamreal అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికి ఈ వీడియోకి 80 వేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కామెంట్లలో చాలా మంది తమ భయాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
“అయ్యో! నా కళ్లకి తాకినట్టు ఫీల్ అయ్యింది.” అంటూ ఒకరు.. “జీవితం అంత సులువుగా లెదురా బ్రో.. ఇలానే డేంజర్తో ఆడుకోవడం మంచిదేనా?”.. “ఇవాళ బతికి ఉన్నాడా లేడా అని డౌటే వచ్చింది.” అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఆ వ్యక్తి సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అతడు ఇటువంటి రిస్కీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇలాంటి వీడియోల వల్లే అతడికి పెద్ద ఫాలోయింగ్ కూడా ఉంది.
గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రకృతి శత్రువుగా మారితే ఎలా ఉంటుందో ఈ వీడియో ఓ ఉదాహరణ. సరదాగా చేస్తూ ప్రమాదాలను లైట్ తీసుకోవడం మంచిదే కాదు. ఒక్క తప్పు ప్రాణాలకే ముప్పు కావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మన చేతిలో ఉన్న చక్కటి పరిష్కారం.
Dil Raju: పైరసీ చేసి చిన్న సినిమాకు 400, పెద్ద సినిమాకు 100 డాలర్లకి అమ్ముతున్నారు!