పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. తాజాగా తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన అయన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోందన్నారు. థియేటర్స్ లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Dil Raju: దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే!
ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం. “తమ్ముడు” సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి.
Also Read:Dil Raju: రివ్యూస్ రాసేప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి!
నేను ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలన్నారు. పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే అని ఆయన అన్నారు. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు అని ఆయన అన్నారు.