బిడ్డలు పెద్ద వాళ్లైనప్పుడో.. లేదంటే గొప్పవాళ్లైనప్పుడో.. ఇంకా లేదంటే ఒకింటి వారు అవుతుంటే ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. ఏ పేరెంట్స్ అయినా.. బిడ్డలకు మంచి చదువు చెప్పించడం. పెద్దయ్యాక.. ఓ అయ్య చేతిలో పెట్టడం. ఇదే కదా? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. దాని ద్వారా వచ్చే ఆనందం.. సంతోషం వేరే లెవల్లో ఉంటుంది. అందుకే కాబోలు.. ఓ తల్లి తన కూతురు ఓ ఇంటిరాలు అవుతోందన్న ఆనందంలో పెళ్లి మండపంపైనే డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ తల్లికి ఇద్దరు కుమార్తెలు.. అందులో ఒకామెకు వివాహం అవుతోంది. పెళ్లికి బంధువులు, స్నేహితులతో సందడి.. సందడిగా ఉంది. అంటే ఉన్నట్టుగా ఆ తల్లి.. తన ఇద్దరు కుమార్తెలతో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘కాలియోన్ కా చమన్’ హిట్ పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. చూస్తున్న వారంతా ముగ్ధులైపోయారు. దీంతో ఈలలు, కేరింతలతో ఉత్సాహపరిచారు. కుమార్తెల డ్యాన్స్ కంటే తల్లి వేసిన స్టెప్పులు చూపరులను ఆకట్టుకుంది.
ముగ్గురూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఇక తల్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మరింత ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆర్ష్‌వెడ్డింగ్ కొరియోగ్రఫీ’ పేరుతో షేర్ చేశారు. అనేక మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. తల్లి చేసిన నృత్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి.. అద్భుతమైన డ్యాన్స్ చేసిందంటూ కొనియాడారు. ఆ డ్యాన్స్ మీరు కూడా చూసేయండి.
View this post on Instagram
A post shared by Arsh Wedding Choreography & Events (@arshweddingchoreography)