మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. బిల్‌ గేట్స్‌పై తేల్చేయనుంది..!

గ్లోబ‌ల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీల‌క నిర్ణయం తీసుకుంది.. సంస్థ ఫౌండ‌ర్‌, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై వ‌చ్చిన‌ లైంగిక వేధింపులపై విచార‌ణ‌కు అమెరికాలోని ప్రముఖ న్యాయ సంస్థ అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్‌పీని నియ‌మించుకుంది. బిల్‌గేట్స్ గురించి మాత్రమే కాదు.. 2019 త‌ర్వాత మైక్రోసాఫ్ట్‌లో ప‌ని చేసే ప‌లువురు సెల‌బ్రిటీల‌పై ఆరోప‌ణ‌లొచ్చాయి. దీంతో లైంగిక వేధింపులు, లింగ వివ‌క్ష, ఇత‌ర స‌మ‌స్యల‌పై కంపెనీ విధానాల‌ను స‌మీక్షించాల‌ని మైక్రోసాఫ్ట్ బోర్డును వాటాదారులు కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలి అనే విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది.

Read Also: తెలంగాణ పల్లెలకు కరోనా టెన్షన్‌.. కారణం ఇదే..!

కాగా, మైక్రోసాఫ్ట్ చైర్మన్‌ పదవి నుంచి 2020 మార్చి నెలలో తప్పుకున్నారు బిల్‌గేట్స్‌.. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్‌’ మీద ఫోకస్‌ చేయడమే అని ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిణామాలు స్పష్టం చేశాయి.. 2007 సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్‌ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్‌ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు వచ్చాయి.. అంతేకాదు.. ఈ వ్యవహారంలో బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇక, టెక్ దిగ్గజం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles