Suhas Shetty Murder Case: గత నెలలో కర్ణాటకలోని మంగళూర్‌లో మాజీ భజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది.
Mangaluru Murder: కర్ణాటక కోస్తా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య జరిగింది. దీని తర్వాత, తాజాగా సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, కోల్తమజలు జుమ్మా మసీదు కార్యదర్శి 32 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పట్టపగలు నరికి చంపబడ్డాడు. ఈ దాడిలో అతడి సహచరుడు కలందర్ షఫీ (29) తీవ్ర గాయాలపాలయ్యారు.
Mangaluru: కర్ణాటక కోస్తా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తతెల్తాయి. బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాత మరో హత్య చోటు చేసుకుంది. వారాల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు జరగడం స్థానికంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, స్థానిక మసీదు కార్యదర్శి అయిన 42 ఏళ్ల ఇంతియాజ్ పట్టపగలు నరికి చంపబడ్డాడు.
పెళ్లి సంబంధం చూసి.. ఓ ఇంటి వాడిని చేసి.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన ఓ బ్రోకర్ హత్యకు గురయ్యాడు. సంబంధం చూసి పెళ్లి చేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
KSRTC Conductor: భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రయాణాలలో ఇలా అనేకచోట్ల జరుగుతున్న సంఘటనలు మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. మంగళూరు నగరానికి ముడిపు నుంచి వస్తున్న బస్సులో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బస్సు కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ప్రయాణిస్తున్న మహిళ…
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది.
Woman drown: కర్ణాటక మంగళూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టుల్లో విషాదం నెలకొంది. వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది. మైసూర్‌కి చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రిసార్టులోని స్మిమ్మింగ్ పూల్‌లో ముగినిపోయి మరణించారు. ప్రైవేట్ బీచ్ రిసార్టులో ఈ ఘటన జరిగింది.
Cruel woman: కర్ణాటక మంగళూర్‌లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. 87 ఏళ్ల మామపై అమానుషంగా ప్రవర్తించింది. వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని వృద్ధుడు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది.
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (PM Modi) మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.