Maharashtra: మహారాష్ట్రలో పులులకు కటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ స్పష్టం చేశారు. అయితే, పులుల మధ్య ఆవాసం, హద్దుల కోసం ఘర్షణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 పులుల చనిపోయాయని తెలిపారు.
Konda Surekha : హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..…
టైగర్ రిజర్వు పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి తెలిపారు. గత ఏడాది మార్చిలో తప్పిపోయిన 4 పెద్దపులి పిల్లలు తిరపతి జూపార్క్ లో ఉంచామని చెప్పుకొచ్చారు.
Deaths Of Tigers increasing in Tamilnadu: పెద్దపులులకు అటవీ ప్రాంతాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. తమిళనాడులో అయితే ఈ మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. పెద్దపులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే కేవలం నెలరోజుల్లోనే తొమ్మిది పెద్ద పులులు ,ఐదు చిన్న పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటి మరణానికి…
Farmer Arrested For Killing Tigers with Poison : తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దు:ఖం…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో పులులు చిరుత పులుల సంచారం ఎక్కువైంది. మొన్నీమధ్య ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరించి వెళ్లిపోగా.. ఉన్నన్ని రోజులు పశువుల పై పంజా విసిరాయి.. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో నీ చిన్న రాజురా శివారులో పులి సంచరిస్తుంది. గ్రామ పరిధిలో నీ పెద్ద వాగు వద్ద పులి పాదముద్రలు చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యరు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాదముద్రలు చూసి ఇది…