తాజాగా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలవుతుంది.నాగచైతన్య పెళ్లి సమయంలో అఖిల్ కూడా తన ప్రేయసి జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ న్యూస్ చెప్పారు. కాగా ఇప్పడు అఖిల్, జైనబ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు ఊపందుకున్నాయి.
మార్చి 24న వీరి పెళ్లి ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే చైతు పెళ్లి సింపుల్ గా కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్యలో జరిగిపోయింది. కానీ అఖిల్ పెళ్లి మాత్రం ధూంధాంగా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్‌ను కూడా వీరి వెడింగ్‌కి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో అఖిల్ ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. కారణం ఎంటన్నది తేలినప్పటికీ వారిద్దరికి బ్రేక్‌అప్ అయ్యింది. దీంతో అప్పుడు అక్కినేని ఫ్యామిలీకి.. పెళ్ళిలు అచ్చు రావడం లేదు అని, చాలా మాటలు వినిపించాయి. కానీ శోభిత కోడలుగా వెళ్లినప్పటి నుంచి నాగార్జున ఇంట్లో వరుసగా గుడ్ న్యూస్‌లు వినపడుతున్నాయి.