ఈ రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. ఈ డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ గురించిన ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోవడం అత్యావశ్యకం. కాగా.. తాజాగా యూపీఐకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని గురించి తెలుసుకుందాం..
READ MORE: Justice NV Ramana: విదేశీ ఉద్యోగం కోసం మాతృభాషను మర్చిపోతున్నారు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను సాధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ.. దాని అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ ద్వారా డిజిటల్ చెల్లింపు విప్లవానికి సంబంధించి డేటాను షేర్ చేసింది. యూపీఐని 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒకే మొబైల్ అప్లికేషన్‌లో చాలా బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయడం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యంగా మారాయి.
READ MORE: YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు జంప్!
2025 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో రూపే క్రెడిట్ కార్డ్‌పై యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీలు 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంతకుముందు సమాచారం అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 63,825.8 కోట్ల రూపాయలకు పైగా 750 మిలియన్ యూపీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. అయితే, FY 2024లో, UPI రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీల సంఖ్య 362.8 మిలియన్లు, దీని మొత్తం విలువ రూ. 33,439.24 కోట్లు.