ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి… అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నోడల్ అధికారులు 24×7 ఉండాలని… ఎక్కువ టెస్టులు చేసేలా సౌకర్యాలు పెంచాలి అని తెలిపింది. అలహీ వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన హైకోర్టు… 45 ఏళ్ల లోపు వారికి ఎపుడు వ్యాక్సిన్ వేస్తారని… అందరికి వ్యాక్సిన్ వేయటంలో ఇబ్బందులు ఏంటన్న కోర్టు తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ కోర్టుకు వాయిదా వేసింది.