ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలాని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అక్కడ మరో కరోనా మృతి నమోదయ్యింది. ఏపీ సెక్రటేరీయేట్లోని పోస్టాఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించాడు. మూడో బ్లాక్ లో ఉన్న ఇండియా పోస్టాఫీసులోని పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఏపీ సచివాలయంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. దాంతో ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు. అయితే కరోనా భయంతో ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదు.