OPPO launching OPPO Pad Air Tablets.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తన వినియోగదారుల కోసం కొత్తగా ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనుంది. ఒప్పో భారత్‌లో నేడు తొలి ట్యాబ్లెట్‌ను విడుదల చేయనుంది. ఎప్పటికప్పుడు తన వినయోదారులను తనవైపు తిప్పుకునేందుకు ఒప్పో కొత్త కొత్త మొబైల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొబైల్ కంపెనీలు సామ్‌సంగ్, ఎల్‌జీ లాంటి బ్రాండ్‌లు ట్యాబ్‌లను విడుదల చేసి దూసుకుపోతున్నాయి. అయితే.. ఇప్పుడు తాజాగా ఒప్పో కూడా ఈ బాటలోకి వచ్చేస్తోంది. తన వినియోగదారులకు మెరుగైన ట్యాబ్లెట్లను అందించనున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ క్రమంలోనే ఒప్పో రెనో 8 సిరీస్, ఒప్పో ఎన్‌కో ఎక్స్2తో పాటు న్యూ ట్యాబ్లెట్‌ను కంపెనీ లాంఛ్ చేయనుంది. షియోమీ ప్యాడ్ 5, మోటో ట్యాబ్ జీ70లకు ఒప్పో ప్యాడ్ ఎయిర్ దీటైన పోటీ ఇవ్వనుంది.
Subway Surfers : ఈ గేమ్‌ను భారతీయులే ఎక్కువగా ఆడుతున్నారట..
ఒప్పో ప్యాడ్ ఎయిర్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 6జీబీ ఎక్ట్సెండెడ్ ర్యామ్‌తో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ట్యాబ్లెట్ 10.36 ఇంచ్ 2కే డిస్‌ప్లే కలిగిన ఒప్పో ప్యాడ్ ఎయిర్ దాదాపు రూ 15,100కు అందుబాటులో ఉండనుంది. భారత్‌లో ఒప్పో బడ్జెట్ ట్యాబ్లెట్‌నే లాంఛ్ చేయనుంది. ఇక ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 కలర్ఓఎస్ 12పై రన్ అవుతుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ సింగిల్ 8ఎంపీ సింగిల్ లెన్స్‌తో పాటు ముందు భాగంలో 5ఎంపీ సెల్పీ కెమెరాతో రానుంది. ఈ ట్యాబ్లెట్ 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతోపాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఒప్పో ప్యాడ్ ఎయిర్ క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటాయి.