చాలా దేశాల్లో సంపాదించే డబ్బుకన్నా కట్టాల్సిన టాక్స్‌లు అధికంగా ఉంటాయి. చట్టాలు కూడా కఠినంగా ఉండటంతో ఖచ్చితంగా ట్యాక్స్‌లు కట్టాల్సిఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్‌లు తక్కువగా ఉండే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అమెరికాలో టాక్స్‌లు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అందుకే చాలామంది డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటున్నారు. చాలా దేశాలు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా క్రిప్టో కరెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వడంతో వస్తువులను, ప్రాపర్టీస్‌ను క్రిప్టో నుంచి కొనుగోలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో విదేశీయులకు టాక్స్ తక్కువగా ఉంటుంది.
Read: ధూమపాన ప్రియులకు షాక్: పొగతాగే వారికే కరోనా రిస్క్ అధికం…
విదేశీయులు కేవలం 4 శాతం టాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. అదే, స్థానికులైతే ఎక్కువ మొత్తంలో టాక్స్ చెల్లించాలి. ఈ బెనిఫిట్స్‌ను ఆసరాగా చేసుకొని అమెరికన్ క్రిప్టో కుబేరులు కరెబియన్ దీవుల్లోని ప్యూర్టోరికోకు క్యూలు కడుతున్నారు. అక్కడ రిసార్ట్, హోటల్స్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీని వినియోగించేవారిక అదనంగా ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో అమెరికన్ కుబేరులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.