నేటి నుంచి జనవరి 9 వరకు శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి రోజు వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు.
ఢిల్లీలో నేడు జీఎస్టీ మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనుండగా జీఎస్టీ మండలి భేటీ కానుంది. పన్ను రేట్ల హేతుబద్దీకరణ ప్రధాన అజెండాగా జీఎస్టీ మండలి భేటీలో చర్చించనున్నారు.
నేడు ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ భేటీ కానుంది. ఉదయం 11.45 గంటలకు వర్చువల్‌గా సభ్యులు భేటీకానున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల విజ్ఞప్తులను కమిటీ పరిశీలించనున్నారు.
నేడు ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్‌పై విచారణ జరుగనుంది. కరోనా మందు పంపిణీ చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు.
నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని కలువనున్నారు. ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించనున్నారు.
నేడు ఉత్తరప్రదేశ్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. అయోధ్య, సంత్ కబీర్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. అనంతరం బరేలీలో రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,260లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.