* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ.. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గవర్నర్ తమిళిసై పర్యటన.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లను కలవనున్న గవర్నర్, 3 గంటల పాటు గ్రామంలోని గిరిజనులతో గడపనున్న గవర్నర్
* నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటన..
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్న పవన్, కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్న పవన్ కల్యాణ్
* నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు.. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
* ఐపీఎల్‌లో నేడు చెన్నైతో తలపడనున్న బెంగళూరు.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతులు, స్వామివారిని దర్శించుకోనున్న స్వరూపానందేంద్రస్వామి
* హైదరాబాద్ నేటి బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,020.. కిలో వెండి ధర రూ. 72,300
* గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో నేడు సీతారామ కళ్యాణం
* తూర్పు గోదావరి జిల్లా: నేడు కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరస్వామి కళ్యాణం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి కళ్యాణం
* ఏపీ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు మంత్రి తానేటి వనిత.. హోం మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణుల భారీ ఏర్పాట్లు