Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day Special: ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. దేశభక్తిని ఉట్టిపడేలా చేసే ఈ పాటలు వింటుంటే రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. అయితే దశాబ్దాల వెనకే తొలి సినీ దేశభక్తి పాట దేశమంతా మారుమోగిందనే విషయం మీకు తెలుసా ? ఇప్పటికీ ఆపాట వస్తే దేహంలో దేశ భక్తి పొంగుకొస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే వెండితెరపై వినిపించిన ఆపాట అప్పట్లోనే ప్రజల్లో దేశభక్తి భావనను రగిలించింది. మరి ఆపాట ఏమిటి ? ఎవరు పాడారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దిలీప్ కుమార్ నటించిన ఆ సినిమా, మహమ్మద్ రఫీ ఆలపించిన ఆ గీతం ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచింది. 1948లో విడుదలైన ‘షహీద్’ (Shaheed) హిందీ చిత్రసీమలో దేశభక్తి కథలకు కొత్త ఊపునిచ్చిన చిత్రంగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దేశభక్తి ప్రధాన అంశంగా ఉండటంతో అప్పట్లోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దిలీప్ కుమార్ నటనతో పాటు సినిమాలోని ‘వతన్ కీ రాహ్ మే’ పాట దేశభక్తి భావాలను బలంగా ప్రతిబింబించింది. ఈ పాటను ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించారు. ఆయనతో పాటు ఖాన్ మస్తానా కూడా గాత్రం అందించారు. అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ గీతానికి స్వరాలు సమకూర్చగా, రాజా మెహందీ అలీ ఖాన్ సాహిత్యం అందించారు. దిలీప్ కుమార్‌పై చిత్రీకరించిన ఈ పాట సినిమా కథలోనే కాకుండా, ఆ కాలం నాటి భారతీయుల భావోద్వేగాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది.
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశం కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న సమయంలో ‘షహీద్’ విడుదలైంది. అందుకే సినిమాలోని దేశభక్తి అంశాలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. ఈ మూవీ అప్పట్లో మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా ‘వతన్ కీ రాహ్ మే’ పాట ప్రజల్లో దేశభక్తి భావనను మరింత ఉప్పొంగేలా చేసింది. హిందీ చిత్రసీమలో దేశభక్తి సినిమాలు, గీతాలు ఆ తర్వాత ఎన్నో వచ్చాయి. కానీ స్వాతంత్ర్యం అనంతరం తొలినాళ్లలోనే ప్రజల భావోద్వేగాలను నేరుగా తాకిన పాటగా ‘వతన్ కీ రాహ్ మే’కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. అందుకే 78 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పాట గురించి స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది.
‘షహీద్’ 1948లో విడుదలైన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకోవడంతో సినిమాకు వచ్చిన ఆదరణ మరింత పెరిగింది. అదే సమయంలో దాని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. వాటిలో ‘వతన్ కీ రాహ్ మే’ ప్రత్యేకంగా నిలిచింది. దిలీప్ కుమార్ తెరపై కనిపించడం, మహమ్మద్ రఫీ గాత్రం, గులాం హైదర్ సంగీతం, రాజా మెహందీ అలీ ఖాన్ సాహిత్యం కలిసి ఈ పాటను హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే దేశభక్తి గీతంగా మార్చాయి. నేటి తరంలో దేశభక్తి పాటలు కొత్త సంగీతంతో పలు భాషలలో వచ్చినా, స్వాతంత్ర్యం వచ్చిన కేవలం ఏడాది తర్వాత దేశ ప్రజల మనసుల్లో జాతీయ భావనను మేల్కొల్పిన ‘వతన్ కీ రాహ్ మే’ ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన పాటగా గుర్తుండిపోయింది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!