భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్‌లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లో 4-5 వ్యక్తులు, డీజే సందీప్ మరియు బార్ సిబ్బందితో మ్యూజిక్ ప్లే చేయడం గురించి గొడవ జరిగింది. మొదట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత…
రేపు(మంగళవారం) వైన్ షాపులు, బార్లు తెరుచుకోవు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్‌లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు.
21వ శతాబ్దంలో దెయ్యాలు ఉన్నాయనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిత్యం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. అలాంటి సంఘటన ఒకటి ఇటీవలే యూకేలోని విల్డ్‌షైర్‌లో ఉన్న లాంగ్ ఆర్మ్ బార్‌లో జరిగింది. ఓ కస్టమర్ కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ బార్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఇంతలో కౌంటర్ డెస్క్‌లోని ఓ గ్లాస్ దానంతట అదే కిందపడి పగిలిపోయింది. మిగతా గ్లాసులన్నీ అలానే ఉన్నాయి. …
సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్‌లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి.…