అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు 3600 కిమీ మేర పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 12 వ తేదీన వీరు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని నొవ్‌లజరెస్కయా నుంచి వీరి ప్రయాణం ప్రారంభమయింది. 80 రోజులపాటు వీరు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర వెనుక చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. శాస్త్ర, విజ్ఞన రంగాల కోసం వీరు వీరి దేహాలను ప్రయోగశాలలుగా మార్చేసుకున్నారు. కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి, వాటిని ఎలా ఎదుర్కొనగలగాలి అనే అంశాలను పరిశోధన చేసేందుకు వీరి ప్రాయాణం సాగుతున్నది.
Read: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు…
మైనస్ 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇలా పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. ఒకవేళ మనిషి చంద్రునిపైనా, మార్స్‌పైనా జీవించాలంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో చెప్పలేని పరిస్థితి. దానికోసం కూడా వీరి యాత్ర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 15 నాటికి 1083 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు బ్రిటన్‌కు చెందిన జస్టిన్ పాక్షా, జేమీ పేసర్‌లు.