Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం…
Osmania University : స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రముఖ విద్యా సంస్థలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, తదుపరి ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా…
గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం…
Spider : స్పైడర్ దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే జీవి. మీరు మీ ఇంటిని 1-2 నెలలు మూసి ఉంచినట్లయితే.. అది ఖచ్చితంగా సాలె గూళ్లతో కప్పబడి ఉంటుంది. అందుకే ప్రజలు ఎప్పుడూ తమ ఇళ్లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు.
Blood Falls: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నెత్తుటి నది వారి కంట పడింది. దానిపై వారి పరిశోధనలు మొదలయ్యాయి.
ప్రపంచ పర్యావరణం కాపాడటమే లక్ష్యంగా, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్‌కు చోటు దక్కింది.
దృవప్రాంతాల్లోని మంచు గత దశాబ్దకాలంగా విపరీతంగా కరుగుతున్నది. ముఖ్యంగా గ్రీన్‌లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా కరుగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. కర్భర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. గ్రీన్‌లాండ్‌లోని మంచుఫలకాల్లోని అడుగుభాగంలోని మంచు కరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి గ్రీన్ లాండ్ లోని మంచు మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్భన వాయువులను నియంత్రించేందుకు…
అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు 3600 కిమీ మేర పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 12 వ తేదీన వీరు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని నొవ్‌లజరెస్కయా నుంచి వీరి ప్రయాణం ప్రారంభమయింది. 80 రోజులపాటు వీరు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర వెనుక చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. శాస్త్ర, విజ్ఞన రంగాల కోసం వీరు వీరి దేహాలను ప్రయోగశాలలుగా మార్చేసుకున్నారు. కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి,…