టీటీడీ కీల‌క నిర్ణ‌యం… ఘాట్‌రోడ్డులో ఇక‌పై ఆ వాహానాలు…

క‌రోనా మ‌హమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.  తిరిగి అన్ని రంగాలు ప్రారంభం అవుతున్నాయి.  ఇక క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకోవ‌డానికి వేలాదిమంది కొండ‌కు వ‌స్తుంటారు.  క‌రోనా స‌మ‌యంలో తాత్కాలిక ఆటంకం ఏర్ప‌డింది.  అయితే, ఇప్పుడు భ‌క్తుల‌కు అనుమ‌తిస్తున్నారు.  ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ద‌ర్శ‌నం మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే,  ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు తిరుపతి నుంచి తిరుమ‌లకు వంద‌లాది ఆర్టీసీ బ‌స్సులు ప్ర‌యాణం చేస్తుంటాయి. డీజిల్ బ‌స్సుల కార‌ణంగా కొండ‌ల్లో కాలుష్యం పెరిగిపోతున్న‌ది.  దీంతో ఈ డీజిల్ బ‌స్సుల స్థానంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూస్తున్న‌ది టీటీడీ. ప్ర‌స్తుతం 35 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కోనుగోలు చేసింది.  వీటీని ఘాట్ రోడ్డులో ప్ర‌యోగాత్మ‌కంగా న‌డుపుతున్నారు.  అంతేకాదు, టీటీడీ ప‌రిధిలోని అధికారుల‌కు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కేటాయించాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది.  ప్ర‌స్తుతం వినియోగిస్తున్న డీజిల్ వాహ‌నాల‌ను తిరుమ‌ల నుంచి అంచెలంచెలుగా తొల‌గించాల‌ని టీటీడీ చూస్తున్న‌ది.  ఎత్తైన కొండ‌ల్లో ఈ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ఎంత మేర‌కు ప‌నిచేస్తాయో చూడాలి.  

Read: ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతున్న ఆఫ్ఘ‌న్ పరిణామాలు…

-Advertisement-టీటీడీ కీల‌క నిర్ణ‌యం... ఘాట్‌రోడ్డులో ఇక‌పై ఆ వాహానాలు...

Related Articles

Latest Articles