Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. నేడు ఇంద్రవెళ్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీతక్క హాజరుకానున్నరు. అక్కడ అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించనున్నారు.
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఇవాల నిర్వహించేందుకు ఆదివాసీ గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమైక్య పాలకుల నిరంకుశ పాలనలో నివాళులు అర్పించేందుకు కూడా వీలులేని ఈ ప్రాంత ప్రజలు నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన…