ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే ఫోకస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. ఇక, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి.. ప్రధానంగా ఏ అంశాలపై ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.. అనే విషయాలపై కేబినెట్‌లో చర్చించనున్నారని తెలుస్తోంది..
also read: కేసీఆర్ చరిత్రను కనుమరుగు చేస్తున్నారు.. ఎప్పటికీ బీజేపీ-టీఆర్‌ఎస్ ఒకటికావు..!
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ఇక, వాసాలమర్రిలో ఇప్పటికే దళితబంధును అమలు చేసిన ప్రభుత్వం.. హుజూరాబాద్‌లో అమలు చేసేందుకు నిధులు విడుదల చేసింది.. ఇదే సమయంలో.. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేసే విషయంపై తాజాగా సీఎం కేసీఆర్ సమావేశం కూడా నిర్వహించారు.. అంతేకాదు.. దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేసే విధంగా టీఆర్ఎస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.. వీటిపై కూడా కేబినెట్‌లో కీలక చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు.. యాదాద్రి నిర్మాణపనులు కూడా పూర్తికావస్తుండడంతో.. ఆలయ ప్రారంభోత్సవంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కూడా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!