బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ వాయిదా..? ఈసారి కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్‌సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు.. దీంతో.. ఈ నెల 24వ తేదీ వరకు సంతాప దినాలుగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.. 24వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.. ఆ ప్రభావం బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాద యాత్రపై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. దీంతో.. ఈ నెల 24 నుంచి బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. కానీ, ఇంకా పాదయాత్ర వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర నాయకత్వం. కాగా, ఇప్పటికే సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రతో వాయిదా వేసుకున్నారు.. ఇప్పుడు మరోసారి కళ్యాణ్‌సింగ్ మృతి కూడా సంజయ్ యాత్రకు బ్రేక్ వేసే అవకాశం ఉందంటున్నారు.
Also Read
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!