Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beetroot Dosa: రోజువారీ ఉదయం అల్పాహారంలో (Tiffins) కొత్తదనం, రుచి, ఆరోగ్యం కలగలిపిన వంటకం కోసం చూస్తున్నారా..? అయితే రొటీన్ కు బిన్నంగా ఎప్పుడు తినే మసాలా దోస కాకుండా ఈ క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోసను ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కలర్ ఫుల్ దోస తయారీ విధానం చాలా సులభం. మరి అది ఎలాగో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
పప్పులు, బియ్యం నానబెట్టుకోవడానికి:
* మినపప్పు: 1 కప్పు
* బియ్యం: 3 కప్పులు
* శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* మెంతులు: కొద్దిగా (1/4 టీస్పూన్)
Also Read
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
రుబ్బేటప్పుడు (మిక్సీలో) వేయవలసినవి:
* బీట్రూట్: 1 (పెద్ద ముక్కలుగా తరిగినది)
* పచ్చిమిర్చి: 6
* అల్లం: 1 అంగుళం ముక్క
ఉప్పు: అర టీస్పూన్ (తగినంత)
నీరు: తగినంత
దోస కాల్చడానికి..
* నూనె: తగినంత
తయారీ విధానం:
ఒక పాత్రలో 1 కప్పు మినపప్పు, 3 కప్పుల బియ్యం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు తీసుకోండి. ఆ తర్వాత వాటిని మంచి నీరు పోసి 6 నుండి 8 గంటల పాటు బాగా నాననివ్వాలి. బాగా నానిన బియ్యం-పప్పుల మిశ్రమాన్ని నీరు తీసివేసి మిక్సీ జార్‌లోకి తీసుకోండి.
ఇప్పుడు అందులోనే తరిగిన బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఉప్పు వేయండి. ఇందులోనే కాస్త కొద్దిగా నీరు చేర్చి, మెత్తని దోస పిండిలా బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు సిద్ధమైన పింక్ రంగు దోస పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కన్సిస్టెన్సీ (పిండి చిక్కదనం) సరిచూసుకోండి. అవసరమైతే కాస్త నీటిని జోడించండి.
దోస పిండి రెడీ అయ్యింది కాబట్టి ఇప్పుడు దోస పెనాన్ని (Pan) పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక, ఒక గరిటెడు బీట్రూట్ పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పల్చగా పరచండి. దోస చుట్టూరా, పైన 1 టీస్పూన్ నూనె వేయండి చాలు. మంటను మధ్యస్త మంటలో ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు దోసను కాల్చండి. అంతే క్రిస్పీ బీట్రూట్ దోస రెడీ..
ఎంతో క్రిస్పీగా, ఆకర్షణీయమైన రంగులో ఉండే వేడి వేడి బీట్రూట్ దోసను కొబ్బరి చట్నీతో గానీ లేదా అల్లం చట్నీతో గానీ వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే ఈ బీట్రూట్ దోసను తప్పకుండా ఇంట్లో వారానికి ఒకసారి ప్రయత్నించండి.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!