ఈ పాదయాత్రలో కొన్ని గ్రామాలకు రాలేకపోతున్నా... మళ్లీ తప్పకుండా వస్తా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు బండి సంజయ్.
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.. అందులో తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఎవరికి వీలైనప్పుడల్లా వారు వస్తూనే ఉన్నారు.. మునుగోడు బై పోల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కూడా జేపీ నడ్డా రావాల్సి ఉన్నా.. చివరి క్షణాల్లో తన పర్యటన రద్దుచేసుకున్న విషయం విదితమే..…
బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడిందని కరీంనగర్ ఎంపీ బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇన్ చార్జి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ సభ రేపు ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షులు, కరీంనగర్ MP బండి సంజయ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ నేడు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దఅంబర్ పేటలో జరగనున్న ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతికి బీజేపీలో మంచిపేరు…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్‌లు వేసేందుకు సిద్ధం అయ్యారు పోలీసులు.. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను సామాన్య ప్రజలే చెప్పుతో కొట్టే రోజులొచ్చాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో మహబూబ్‌నగర్ జిల్లా వాళ్ల కంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. పాదయాత్రలో బండి సంజయ్..పిచ్చికుక్కలా మాట్లాడితే… అర్వింద్ ఊరకుక్కలా మాట్లాడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ స్థాయికి, హోదాకు, వయస్సుకు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న…