నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కొడుకు గౌతంరెడ్డి వివాహ రిసెప్షన్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ హెచ్చరికలతో పర్యాటక కేంద్రాలు క్లోజ్.. కైలాసగిరి సహా బీచ్ రోడ్డులో ఉన్న సందర్శన స్థలాల మూసివేతకు VMRDA నిర్ణయం.. నేడు, రేపు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశం నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు…
Liquor Shop Licence: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపుల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కోసం ఏకంగా 95,137 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల గడువు గురువారం (అక్టోబర్ 23) రాత్రి వరకు పొడిగించగా.. చివరి రోజు ఒక్కరోజే 4,822 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు నడవకపోవడం, కొన్నిచోట్ల బ్యాంకులు పనిచేయకపోవడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును పొడిగించిన…
Liquor Shops: మూడు హాఫ్ లు… ఆరు ఫుల్లులు అనుకుంటే లిక్కర్ సిండికేట్ వ్యాపారం చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేసిన సర్కార్.. 20 శాతం మార్జిన్ పై ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావని ఆందోళనలో ఉంటే ఇటీవల పర్మిట్ రూమ్ ల పరేషాన్ ఎక్కువైందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందు కోసం ఏడున్నర లక్షలు చెల్లించాలని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని…
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…
Wines Tender : తెలంగాణలో వైన్ షాపుల టెండర్లకు ఈసారి అంచనాలకు మించి స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,620 మద్యం షాపుల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో కేవలం ఒక్కరోజులోనే దాదాపు 10 వేల దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వంకు భారీ ఆదాయం చేరింది. Wife: పాపం రా.. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని.. కట్టుకున్న భార్యను ఇప్పటివరకు మొత్తం 25 వేలకు పైగా దరఖాస్తులు…
డిసెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు.
దసరా పండుగ సీజన్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్ నెలలోనే రూ.3,048 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొత్త మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించి మద్యం టెండర్లలో…