ఓమిక్రాన్ కేసుల మధ్య భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సిరీస్ జరుగుతుందా.. లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ ఏది ఏమైనా బీసీసీఐ టీం ఇండియాను సౌత్ ఆఫ్రికా పంపడానికి బీసీసీఐ సిద్ధమైంది. కానీ ఈ పర్యటనలో మొదట టీ20 సిరీస్ కూడా ఉండగా… దానిని వాయిదా వేసింది.
Read Also : బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందా…?
అయితే ఈరోజు భారత ఆటగాళ్లు అందరూ సౌత్ ఆఫ్రికా పయనమయ్యారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఆటగాళ్లు విమానంలో ఉన్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
అయితే ఇక్కడ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకున్న టీం ఇండియా సౌత్ ఆఫ్రికా కు చేరుకున్న తర్వాత కూడా మూడు రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓమిక్రాన్ మధ్య కట్టుదిట్టమైన బయో బబుల్ లో రెండు జట్లు మొదట టెస్ట్ సిరీస్ లో తలపడతాయి.