పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని…