జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పు గోదావరి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగసభకు అనుమతి లేదని అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు.. సభా వేదిక మార్చుకోవాలని సూచించినట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు.. బాలాజీపేటలో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు అనుమతిలేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది జనసేన.. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్చామని.. అనుమతి లేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజీపై కార్యక్రమం రద్దు చేశామని తెలిపారు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.. అయితే, రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్ లో రేపు ఉదయం 9గంటలకు పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉంటుందన్నారు.. అనంతరం హుక్కుంపేట – బాలాజీపేట రోడ్డులో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు జనసేనాని.. పోలీసులు అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టిన పవన్ కల్యాణ్ పర్యటన జరిగి తీరుతుందని జనసేన ప్రకటించింది.