Delhi Red Fort: మొఘల్ కాలంలో నిర్మించిన ఢిల్లీ ఎర్రకోట భారతదేశానికి గర్వకారణంగా మారింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు.
ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఓ సీక్రెట్ సొరంగమార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మరోసారి గుర్తించారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ మార్గం ద్వారా ఎర్రకోటకు తరలించేవారని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్కొన్నారు. 1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదటిసారి ఈ సొరంగమార్గం గురించి విన్నానని, అయితే, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంత…