మార్కెట్ లో ఒక ఆవు ధర ఎంతుంటుంది? మహా ఉంటే యాబై వేలు. మంచి పాలిచ్చే అవులు అయితే రూ.లక్ష వరకు ఉంటుందేమో. కానీ ఓ ఆవు ధర ఏకంగా రెండు లక్షలపైనే పలికింది. మహారాష్ట్రలోని కర్దన్‌వాడి(ఇందాపూర్‌లో) రైతు అనిల్ థోరట్‌కు చెందిన సంకర జాతి ఆవు రెండు లక్షల 11 వేల రూపాయల ధర పలికింది. పశువులకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి. కర్దన్‌వాడికి చెందిన అనిల్ థోరట్ 75 శాతం హెచ్‌ఎఫ్ ఉత్పత్తి చేసే ‘BAF’ దూడను పెంచాడు. దూడకు 28 నెలలు నిండిన తర్వాత అతను ఈ ఆవును విక్రయించాడు. ఈ ఆవు రెండు లక్షల 11 వేల రూపాయల ధర పలికింది.
Also Read:Thursday stotram: గురువారం ఈస్తోత్రం వింటే సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయి
ఈ ఆవు కనీసం 28 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా. మొదటి దూడ తర్వాత ఆవు పాలలో మరింత పెరుగుదల కనిపించింది. ఆవును పెంచుతున్నప్పుడు, థోరట్ చెరకును మేతగా, మొక్కజొన్న, మొక్కజొన్న పొట్టు, ఇతర అవసరమైన ఆహారాన్ని మేతగా ఉపయోగించాడు. థోరట్ ఏప్రిల్ 8న ఈ ఆవును విక్రయించగా.. ఈ ఆవును చూసిన లాసుర్నేకు చెందిన తుకారాం ఇంగ్లే ఆవును రెండు లక్షల 11 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
Also Read:IPL 2023 : డాడ్స్ ఆర్మీకి చెపాక్ లో ఝులక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్
హెచ్ఎఫ్ ఆవు జాతి 35 లీటర్ల వరకు పాల దిగుబడిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆవు పాల ధర కనీసం రూ.40 ఉంది. ఎక్కువ పాలు ఇచ్చే ఒకే ఒక జాతి ఆవు. ఈ ఆవు పాల ద్వారా రోజుకు రూ.1500 రూపాయల వరకు ఆదాయం పొందుతాడు.