IPL 2023 : డాడ్స్ ఆర్మీకి చెపాక్ లో ఝులక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ -16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు.. గడిచిన మూడు రోజులుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లలో ఫలితాలు తేలుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అదే బాటలో కొనసాగింది. చివరి బంతి వరకూ ఫలితం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. రాజస్థాన్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై.. 113 పరుగులకే కుప్పకూలిపోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ( 15 బంతల్లో 25 నాటౌట్, సిక్స్ ), వరల్డ్ బెస్ట్ ఫినిషిర్ ఎంఎస్ ధోని ( 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు )తో ధనాధన్ ఇన్సింగ్స్ తో మ్యాచ్ కు థ్రిల్లింగ్ ఎండింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా సందీప్ శర్మ వేసిన లాస్ట్ బాల్ ను తెలివిగా వేయడంతో సీఎస్కే నుంచి విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ లాగేసుకుంది. చెపాక్ పిచ్ పై 175 పరుగులను డిఫెండ్ చేసుకుంది. స్పిన్నర్లు అశ్విన్, చాహల్, జంపాలు చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ ముగ్గురు స్పిన్ ఉచ్చులో పడ్డ చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడింది.
Read Also : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి రెండో ఓవర్లోనే షాగ్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్( 8)ను సందీప్ శర్మ ఔట్ చేశాడు. గత మ్యాచ లో ముంబైపై సుడిగాలి ఇన్సింగ్స్ ఆడిన అజింక్యా రహానే ( 19 బంతుల్లో 31, 2 ఫోర్లు, సిక్స్ ) తో కలిసి డేవాన్ క్వాన్వే ( 38 బంతుల్లో 50: 6 ఫోర్లు )లు చెన్నైని ముందుకు నడిపించారు. రహానే-కాన్వే మరీ ధాటీగా ఆడకపోయినా రన్ రేట్ 7కు తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండంతో సంజూ శాంసన్ తెలివిగా జోస్ బట్లర్ స్థానంలో ఆడమ్ జంపాను ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి తీసుకున్నాడు. అశ్విన్ వేసిన 10 మూడో బంతికి రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానే స్థానంలో వచ్చిన శివమ్ దూబే ( 8) ఆకట్టుకోలేదు. స్పిన్నర్లు రెండు వైపూలా కట్టడి చేస్తుండటంతో చెన్నైకి పరుగుల రాక కష్టమైంది. మొయిన్ ఆలీ ( 7) కూడా విఫలమయ్యాడు. మగల స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రాయుడు (1) కూడా భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. పదో ఓవర్ నుంచి 14 ఓవర్ వరకూ ఐద ఓవర్లలో చెన్నై కేవలం 27 పరుగులు చేసి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.
Read Also : Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇక చాహల్ వేసిన 15వ ఓవర్లో ఐదో బాల్ కు హాఫ్ సెంచరీ చేసుకున్న కాన్వే.. లాస్ట్ బాల్ కి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఇక చివరి 5 ఓవర్లలో 63 పరుగులు చేయాల్సి ఉండగా ధోనితో కలిసి రవీంద్ర జడేజాలు చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించారు. జంపా వేసిన 18 ఓవర్లో ధోని 4,6 కొట్టాడు. 12 బంతుల్లో 40 పరుగులు కావాల్సిన పరిస్థితిలో జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్ లో ఫోర్, రెండు సిక్సర్లు కొట్టాడు రవీంద్ర జడేజా.. ఇక చివరి ఓవర్ లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. శాంసన్ బంతిని సందీప్ శర్మకు అందించాడు. తొలి రెండు బంతులు వైడ్స్ వేసి.. రెండు, మూడు బంతులను ధోని సిక్సర్లుగా కొట్టి..4,5 బంతులకు రెండు పరుగులే వచ్చాయి. ఇక చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన పరిస్థితిలో సందీప్ వేసిన యార్కర్ డెలివరీని ధోని ఒక్క పరుగు మాత్రమే తీయడంతో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 200వ మ్యాచ్ ఆడింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బట్లర్ ( 52)తో పాటు పడిక్కల్ ( 38), అశ్విన్ ( 30), హెట్మెయర్ ( 30)లు రాణించారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవింద్ర జడేశాలు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ ఆలీ ఒక వికెట్ తీసుకున్నాడు.

తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!