కుమారుడి పెళ్లి కోసం రోడ్డు వేయించిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా కొత్తనవరసపురం నుంచి విశాఖ జిల్లా యలమంచిలి మండలం మేడపాడు వరకు సుమారు 15 కిలోమీటర్ల రహదారి గోతులమయంగా తయారైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రహదారి దుస్థితిపై గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం దక్కలేదు.
Read Also: ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం! ఎందుకంటే…
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
అయితే ఇటీవల నవరసపురం గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణరావు కుమారుడి వివాహం జరిగింది. తన కుమారుడి పెళ్లి వేడుకకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని భావించిన నిరీక్షణరావు రూ.2 లక్షల నగదు వెచ్చించి గ్రామ పరిధిలోని రోడ్డుపై పడిన గోతులను పూడ్పించి మరమ్మతులు చేయించాడు. రెండేళ్లుగా గోతులతో తీవ్ర అధ్వాన్నంగా మారిన రోడ్డుకు తన కుమారుడి పెళ్లి కోసం సొంత డబ్బులు వెచ్చించి బాగుచేయించిన తండ్రి నిరీక్షణరావును స్థానికులు అభినందిస్తున్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రహదారులు, భవనాల శాఖ డీఈ హరిప్రసాద్ ఈ రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నుంచి రూ.40 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్‌బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!