డిసెంబర్ నుంచి వంటనూనె ధరలు త‌గ్గ‌నున్నాయా…?

క‌రోనా స‌మ‌యంలో దేశంలో వంట‌నూనెల ధ‌ర‌లకు రెక్క‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.  భారీ స్థాయిలో ధ‌ర‌లు పెరిగాయి.  నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు.  అయితే రెండు నెల‌ల క్రితం కొంత‌మేర ఆ ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ, వంట‌నూనెల త‌యారీలో వినియోగించే పామాయిల్ గింజ‌లు, సోయాబీన్స్ వంటి వాటిని బ‌యోప్యూయ‌ల్‌గా వినియోగించ‌డానికి ఎక్క‌వ ఆస‌క్తి చూపుతుండ‌టంతో అంత‌ర్జాతీయంగా నూనెల ధ‌ర‌లు పెరిగాయి.  అయితే, పామాయిల్‌, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిపై దిగుమ‌తి సుంకాన్ని త‌గ్గించ‌డంతో ధ‌ర‌లు కొంత‌మేర అదుపులోకే ఉన్నాయి.  అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు 20 శాతానికి పైగా పెరిగితే, దేశీయంగా 2 శాతం మేర ధ‌ర‌లు పెరిగాయి.  ప్ర‌స్తుతం వంట‌నూనెలకోసం వినియోగించే సోయాబీన్స్‌, పామాయిల్ పంట‌లు చేతికి రావ‌డంతో మ‌రోసారి నూనెల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  కానీ, బ‌యోప్యూయ‌ల్ కోసం సోయాబీన్స్‌, పామాయిల్ గింజ‌ల‌ను వినియోగిస్తుండ‌టంతో ఎంత‌మేర ధ‌ర‌లు త‌గ్గుతాయో చూడాలి.  డిసెంబ‌ర్ నుంచి వంట‌నూనె ధ‌ర‌ల‌పై వీటి ప్ర‌భావం క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: భాగ్య‌న‌గ‌రంలో మ‌ళ్లీ భారీ వ‌ర్షం … మునిగిన మూసారాంబాగ్ వంతెన‌…

Related Articles

Latest Articles

-Advertisement-